Hyderabad | హైదరాబాద్‌లో గృహ నిర్మాణాల జోరు.. నిరుడుతో పోల్చితే 104 శాతం వృద్ధి
హైదరాబాద్‌లో పూర్తయ్యే ఇండ్ల నిర్మాణం ఈ ఏడాది గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, 2022తో పోల్చితే 2023లో 104 శాతం వృద్ధిరేటు ఉంటుందని ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ విశ్లేషణ సంస్థ అనరాక్ తమ తాజా నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్‌సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో నివాస గృహ నిర్మాణాలు, వాటి విక్రయాలపై అనరాక్ ఓ అధ్యయనాన్ని నిర్వహించింది.
- ఈ ఏడాది మరిన్ని పూర్తికావచ్చు
- నిరుడుతో పోల్చితే 104 శాతం వృద్ధి: అనరాక్ తాజా నివేదిక
Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో పూర్తయ్యే ఇండ్ల నిర్మాణం ఈ ఏడాది గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, 2022తో పోల్చితే 2023లో 104 శాతం వృద్ధిరేటు ఉంటుందని ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ విశ్లేషణ సంస్థ అనరాక్ తమ తాజా నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్‌సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో నివాస గృహ నిర్మాణాలు, వాటి విక్రయాలపై అనరాక్ ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. సోమవారం విడుదలైన ఈ అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా నివాస గృహ విక్రయాల్లో నిరుడు (2022) బెంచ్ మార్క్ సెట్ చేసినప్పటికీ, 2023 సంవత్సరం దాన్ని మించి రికార్డుల్ని నెలకొల్పవచ్చన్నది. ఏడు నగరాల్లోని మొత్తం స్టాక్‌లో 4% వాటాతో హైదరాబాద్‌లో హౌసింగ్ కంప్లీషన్లు 2022 కంటే 104% పెరగనున్నాయని నివేదికలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అనరాక్ గ్రూప్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ‘షెడ్యూల్డ్ కంప్లీషన్ రికార్డుల ప్రకారం.. 2023లో టాప్ 7 నగరాల్లో సుమారు 5.6 లక్షల గృహాలు డెలివరీ చేసే అవకాశం ఉంది. ఇది గత సంవత్సరంతో పోల్చితే 39% పెరుగుదల, దేశీయ నివాస రియల్ ఎస్టేట్ విభాగం సంవత్సరానికి 0.5 మిలియన్ డెలివరీల మారును దాటిన నేపథ్యంలో ఇది ఒక ప్రధాన మైలురాయి వంటిదే’ అన్నారు. 2017లో 2 లక్షల యూనిట్లు ఉండగా, 2023 సంవత్సరానికి 2.8 రెట్లు పెరుగబోతోందన్నారు.
‘ఈ పెరుగుదలకు ప్రధాన కారణాల్లో కఠినమైన రెరా నిబంధనతోపాటు ఇతర బలమైన కారణాలున్నాయి. మెరుగైన రీతితో నగదు అందుబాటులో ఉండటంతో నిర్మాణాలు సకాలంలో పూర్తి అవుతాయి. డెవలపర్లు తమ ప్రాజెక్టును పూర్తి చేయడంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ప్రాజెక్టు ఆలస్యం కారణంగా ఇన్పుట్ ఖర్చులు సైతం పెరుగుతున్న విషయాన్ని గుర్తించి, సకాలంలో పూర్తి చేసేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు’ అని అధ్యయన నివేదికలో అనరాక్ పేర్కొంది.
అదేవిధంగా నిర్మాణ రంగంలో సాంకేతికతతో కూడిన పద్ధతులు అందుబాటులో ఉన్నాయని, ఖర్చుతో కూడుకున్న పనులను సైతం ఆధునిక సాంకేతికతలతో సులభం చేసే విధానం నిర్మాణ రంగంలో ఉందన్నది. ఇక దేశంలోని నిర్మాణ సంస్థలు 66% డిజిటల్ పరివర్తనకు ప్రాధాన్యతనిస్తున్నాయని అనరాక్ ఈ సందర్భంగా పేర్కొన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

