న్యూఢిల్లీ, మార్చి 9: హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ)..సూపర్ బైకులు జీఎల్1800 గోల్డ్ వింగ్, సీబీఆర్ 1000ఆర్ఆర్‌లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. పరిశీలించడానికి, ఇంధన పంపులో ఏర్పడిన సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ బైకులను వెనక్కి పిలిపిస్తున్నది.
వీటిలో డిసెంబర్ 2017 నుంచి డిసెంబర్ 2023 వరకు తయారైన హోండా జీఎల్1800 గోల్డ్ వింగ్ బైకులతోపాటు సెప్టెంబర్ 2017 నుంచి ఏప్రిల్ 2020 లోపు ఉత్పత్తైన సీబీఆర్1000ఆర్ఆర్ మాడళ్లు ఉన్నాయి.