హైదరాబాద్, జూన్ 8: డిజిటల్ మౌలిక సదుపాయాలు, డాటా మేనేజ్మెంట్ సేవల సంస్థ హిటాచీ వంటారా.. భారత్‌లో తన తొలి అప్లికేషన్ రిలయబిలిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఆరంభించింది. 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌తో అంతర్జాతీయంగా ఉన్న క్లయింట్లకు క్లౌడ్ సేవలు మరింత సులువుగా అందించడానికి వీలు పడనున్నదని హిటాచీ వంటారా సీఈవో గజేన్ కందయ్య తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో 3,500 మంది సిబ్బంది కలిగివున్న సంస్థకు, కొత్తగా ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌తో మరో 400 మంది జతకానున్నట్లు ఆయన చెప్పారు.