హైదరాబాద్, జూన్ 9: అమెరికాకు చెందిన టెక్నాలజీ సేవల సంస్థ హైలాండ్..భారత్ తన తొలి కార్యాలయాన్ని హైదరాబాద్‌లో సోమవారం ప్రారంభించింది. అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగా నగరంలో నెలకొల్పిన ఈ నూతన సెంటర్‌ను అమెరికా కౌన్సిల్ జనరల్ ఫర్ హైదరాబాద్ జెన్నిఫర్ లార్సన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హైలాండ్ సీటీవో టిం మెకింటైర్ మాట్లాడుతూ..హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి టెక్నాలజీ ఎకోసిస్టాన్ని నెలకొల్పినట్టు చెప్పారు.
13 నుండి ‘ైస్టెల్ తత్వ’
అమీర్‌పేట్, జూన్ 9 : ఎఫ్ఐసీసీఐ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్ఓ) హైదరాబాద్ చాప్టర్ నిర్వహిస్తున్న ‘ైస్టెల్ తత్వ’ ఐదో ఎడిషన్ ఈ నెల 13, 14 తేదీల్లో హైటెక్స్‌లోని హాల్ 2లో జరగనుంది. సిగ్నేచర్ ఫ్యాషన్, లైఫ్ ైస్టెల్ ఎగ్జిబిషన్‌కు సంబంధించిన వివరాలను సోమవారం ఎఫ్ఎల్వో హైదరాబాద్ అధ్యక్షురాలు ప్రతిభా కుందా వివరించారు. ఈ రెండు రోజుల ఎగ్జిబిషన్లో దేశవ్యాప్తంగా 205 మంది పాల్గొంటున్నారని, వీరిలో ఫ్యాషన్, డెకర్, హ్యాండ్లుమ్, ఆభరణాలు, హోమ్ లీవింగ్, కళాత్మక ఉత్పత్తుల విభాగాల్లో విస్తృత శ్రేణి ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. 10 వేల మందికి పైగా సందర్శకులు ఈ ఎగ్జిబిషన్లో తిలకించేందుకు వస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.
బీమా సంస్థల రికార్డు
న్యూఢిల్లీ, జూన్ 9: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో జీవిత బీమా సంస్థలు రికార్డు స్థాయిలో నూతన బిజినెస్ ప్రీమియంను వసూళ్లు చేశాయి. ఏప్రిల్, మే నెలల్లో జీవిత బీమా సంస్థలు 10.8 శాతం మేర నూతన బిజినెస్ ప్రీమియం వసూళ్లలో వృద్ధిని సాధించాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఒక మే నెలలోనే 12.6 శాతం వృద్ధిని నమోదు చేసుకోవడం విశేషం. దీంతో గత నెలలో నూతన బిజినెస్ ప్రీమియం ఆదాయం రూ.27,034 కోట్ల నుంచి రూ.30,463 కోట్లకు పెరిగాయి. మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.47,293 కోట్ల నుంచి రూ.52,427 కోట్లకు చేరుకున్నాయి.