Hero Xtreme 250R | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) తన హీరో ఎక్స్ట్రీమ్ 250 ఆర్ (Hero Xtreme 250R) మోటారుసైకిల్‌ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో-2025లో ఆవిష్కరించింది. ఈ మోటారు సైకిల్ ధర రూ.1.80లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. దేశవ్యాప్తంగా అన్ని డీలర్షాప్ల వద్ద అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి నుంచి హీరో ఎక్స్ట్రీమ్ 250 ఆర్ (Hero Exteme 250R) మోటార్ సైకిల్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభం అవుతాయని హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) తన సోషల్ మీడియా వేదికలపై పోస్ట్ చేసింది. మార్చి నుంచి మోటార్ సైకిళ్ల డెలివరీ ప్రారంభం అవుతుంది. హీరో ఎక్స్ట్రీమ్ 250 ఆర్ (Hero Xtreme 250R) మోటారు సైకిళ్లు మూడు రంగుల్లో లభిస్తాయి.
ఈఐసీఎంఏ-2023 (EICMA 2023)లో ఆవిష్కరించిన ఎక్స్టంట్ 2.5 (Xtunt 2.5 R) కాన్సెప్ట్ ఆధారంగా హీరో ఎక్స్ట్రీమ్ 250ఆర్ (Hero Xtreme 250 R) మోటారు సైకిల్ రూపుదిద్దుకున్నది. స్కల్ప్టెడ్ ఫ్యుయల్ ట్యాంక్, అగ్రెసివ్ హెడ్ యూనిట్, అన్ స్వెప్ట్ టెయిల్ సెక్షన్ డిజైన్‌తో వస్తోందీ మోటారు సైకిల్. కొత్తగా అభివృద్ధి చేసిన ఇంజిన్‌తో విస్తృత శ్రేణి వసతులు అందుబాటులో ఉన్నాయి.
హీరో ఎక్స్ట్రీమ్ 250ఆర్ (Hero Xtreme 250 R) మోటారు సైకిల్ ఆటో ఇల్ల్యూమినేషన్ క్లాస్ డీ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ డీఆర్ఎల్స్, స్ప్లిట్ సీట్ కాన్ఫిగరేషన్, స్విచ్ఛబుల్ ఏబీఎస్, లాప్ టైమర్, డ్రాగ్ టైమర్, మీడియా కంట్రోల్‌తోపాటు టర్న్ బై టర్న్ నేవిగేషన్ను అనుమతిస్తూ బ్లూటూత్ కనెక్టివిటీ మద్దతుతో ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఫీచర్లు జత చేశారు. ఫ్రంట్‌లో 43ఎంఎం యూఎస్డీ ఫోర్క్స్, రేర్ మోనోషాక్ యూనిట్ విత్ సిక్స్ స్టెప్ అడ్జస్టబుల్ ప్రీలోడ్, రేర్‌లో రాడికల్ టైర్‌తోపాటు 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ విత్ ట్యూబ్ లెస్ టైర్స్, డ్యుయల్ చానెల్ ఏబీఎస్ హ్యాండిల్ బ్రేకింగ్ డ్యూటీస్తోపాటు డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి.
హీరో ఎక్స్ట్రీమ్ 250ఆర్ (Hero Xtreme 250 R) మోటారు సైకిల్ ఆల్ న్యూ 250సీసీ డీవోహెచ్సీ, ఫోర్ వాల్వ్, సింగిల్ సిలిండర్ విత్ సిక్స్ స్పీడ్ ట్రాన్స్మిషన్,కరిజ్మా ఎక్స్ఎంఆర్ 250లో మాదిరిగా లిక్విడ్ కూల్డ్ యూనిట్ ఉంటుంది. ఈ మోటారు సైకిల్ ఇంజిన్ గరిష్టంగా 9250 ఆర్పీఎం వద్ద 29.5 బీహెచ్పీ విద్యుత్, 7250 ఆర్పీఎం వద్ద 25 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. కేవలం 3.25 సెకన్లలో గంటకు 60 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది.