Hero XPluse 200 4V 2023 | హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) దేశీయ మార్కెట్లోకి ‘హీరో ఎక్స్‌ప్లస్ 200 4వీ 2023 (Hero XPluse 200 4V 2023) బైక్ బుధవారం ఆవిష్కరించింది. రెండోదశ బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా ఈ అడ్వెంచర్ బైక్‌లో ఇంజిన్ అప్డేట్ చేసింది. హీరో ఎక్స్‌ప్లస్ 200 4వీ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ బైక్ రూ.1.43 లక్షలు, ప్రో వేరియంట్ బైక్ రూ.1.50 లక్షలు పలుకుతుంది.
హీరో ఎక్స్‌ప్లస్ 2004వీ బైక్ (Hero XPluse 200 4V 2023 Edition) బోల్డ్ గ్రాఫిక్స్, డ్యుయల్ టోన్ కలర్స్‌లో లభిస్తుంది. బేస్ వేరియంట్ మ్యాట్లె నెక్సస్ బ్లూ, టెక్నో బ్లూ, బ్లాక్ స్పోర్ట్స్ రెడ్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయొచ్చు. ‘ప్రో’ వేరియంట్ ప్రో వైట్ కలర్ ఆప్షన్ లోనే లభిస్తుంది.
హీరో ఎక్స్‌ప్లస్ 2004వీ బైక్ (Hero XPluse 200 4V 2023) న్యూ 60ఎంఎం ట్యాలర్ ర్యాలీ-స్టైల్ వైండ్ షీల్డ్, క్లాస్-డీ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ విత్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉంటుంది. దీంతోపాటు అప్ డేటెడ్ లగేజ్ ప్లేట్, హ్యాండ్ గార్డ్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
హీరో ఎక్స్‌ప్లస్ 2004వీ బైక్ (Hero XPluse 200 4V 2023) 200 సీసీ వన్-వాల్వ్ ఆయిల్-కూల్డ్ బీఎస్-6 4వీ ఇంజిన్ ట్యూన్డ్ విత్ 5-స్పీడ్ గేర్ బాక్స్ కలిగి ఉంటది. ఈ ఇంజిన్ గరిష్టంగా 8000 ఆర్పీఎం వద్ద 18.8 బీహెచ్పీ విద్యుత్, 6500 ఆర్పీఎం వద్ద 17.35 ఎన్ఎం గరిష్ట టార్చి వెలువరిస్తుంది.
హీరో ఎక్స్‌ప్లస్ 2004వీ బైక్ (Hero XPluse 200 4V 2023) మూడు న్యూ ఏబీఎస్ రైడింగ్ మోడ్స్ లో వస్తున్నది. రోడ్, ఆఫ్-రోడ్, ర్యాలీ మోడ్ల్లో లభిస్తుంది. డ్రై రోడ్ పైనా దూసుకెళ్లే రోడ్ మోడ్, ఆఫ్-రోడ్ మోడ్ లో ఏబీఎస్ పవర్ తగ్గుతుంది. ఇసుక, రాళ్ల మధ్య, కొండ ప్రాంతాల్లో సజావుగా వెళ్లగలుగుతుంది. ర్యాలీ మోడ్ లో ఏబీఎస్ పూర్తిగా స్విచ్చ్‌డ్ ఆఫ్ అవుతుంది.
హీరో ఎక్స్‌ప్లస్ 2004వీ బైక్ (Hero XPluse 200 4V 2023) ప్రో వేరియంట్ ఫ్రంట్‌లో పూర్తిగా 250ఎంఎం అడ్జస్టబుల్ సస్పెన్షన్, రేర్ లో 220ఎంఎం సస్పెన్షన్ ఉంటుంది. 270 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 850 ఎంఎం సీట్ హైట్‌తోపాటు ఎక్స్ టెండెడ్ గేర్ లివర్, హ్యాండిల్ బార్ రైజర్ ఉంటది.