Hero Moto Corp | దేశంలోనే అతిపెద్ద టూ వీలర్స్ కంపెనీ మరో హీరో మోటో కార్ప్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేసింది. ఈ నెల 21న జీరో ఎమిషన్స్ డే సందర్భంగా ‘లార్జెస్ట్ ఆన్లైన్ఫోటో ఆల్భమ్’ ను ఆవిష్కరించింది. కర్భన ఉద్గారాల నియంత్రణ కోసం ‘హీరో గ్రీన్ డ్రైవ్’ అనే పేరుతో హీరో మోటోకార్ప్ దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా సుమారు 1,37,775 మొక్కలను నాటే ఫోటోలతో ‘లార్జెస్ట్ ఆన్లైన్ఫోటో ఆల్భమ్’తో హీరో మోటార్‌కార్ప్ గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కింది. హీరో మోటో కార్ప్స్ కంపెనీ గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదు చేయడం ఇది రెండోసారి.
గత నెలలో ‘అతిపెద్ద మోటార్‌సైకిల్ లోగో’ సృష్టించినందుకు హీరో మోటోకార్ప్ తొలిసారి గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేసింది. ఈ ఫీట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని సంస్థ ప్లాంట్‌లో సాధించింది. ‘హీరో గ్రీన్ డ్రైవ్’తో తమ సంస్థ జీరో ఎమిషన్స్ అమలుకు కట్టుబడి ఉందని హీరో మోటో కార్ప్ గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్ అండ్ స్ట్రాటర్జీ అధిపతి మాలో లేమాసన్ చెప్పారు.