Hero HF Deluxe Canvas Black | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) దేశీయ మార్కెట్లోకి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe Special Canvas Black Edition) స్పెషల్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్ ఆవిష్కరించింది. ఈ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe) నాలుగు కలర్ ఆప్షన్లు – నెక్సస్ బ్లూ, క్యాండీ బ్లేజింగ్ రెడ్, హెవీ గ్రే విత్ బ్లాక్, బ్లాక్ విత్ స్పోర్ట్స్ రెడ్ రంగుల్లో లభిస్తుంది. సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్ అంటే హీరో హెచ్ఎఫ్ డీలక్స్ డ్రమ్ సెల్ఫ్ బైక్ రూ.66,408లకు లభిస్తుంది. కిక్ వేరియంట్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ డ్రమ్ కిక్ బైక్ ధర రూ.60,760లకు సొంతం చేసుకోవచ్చు. యూఎస్బీ చార్జర్ ఆప్షన్‌తోపాటు కిక్ లేదా సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
ఆల్ బ్లాక్ థీమ్‌తో కూడిన బ్లాక్డ్ ఔట్ ఇంజిన్, అల్లాయ్ వీల్స్, మఫ్లర్, ఫ్రంట్ ఫోర్క్ అండ్ గ్రాబ్ రెయిల్ వంటి ఫీచర్లు ఉంటాయి. సెల్ఫ్ అండ్ సెల్ఫ్ ఐ3ఎస్ వేరియంట్లలో ట్యూబ్ లెస్ టైర్స్ స్టాండర్డ్ ఫీచర్లుగా ఉంటాయి. యూఎస్బీ చార్జర్ యాక్సెసరీగా లభిస్తుంది.
హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఇంజిన్ 97.2సీసీ ఎయిర్ కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఓహెచ్సీ, బీఎస్-5 (ఓబీడీ-2 కంప్లియంట్) పీఎఫ్ఐ ఇంజిన్ విత్ ఎక్స్ సెన్స్ టెక్నాలజీతో వస్తున్నది. ఇది 5.9 కిలోవాట్ల విద్యుత్, 8.05 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
హీరో హెచ్ఎఫ్ డీలక్స్ 9.6 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 2-స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్, అల్లాయ్ వీల్స్, 733 లాంగ్ సీట్, ట్యూబ్ లెస్ టైర్స్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, క్రోమ్ లెగ్ గార్డ్, టాయ్ గార్డ్ ఫీచర్లు కూడా ఉంటాయి. ఐదేండ్ల వారంటీతోపాటు ఐదు ఫ్రీ సర్వీసులు లభిస్తాయి.
హీరో హెచ్ఎఫ్ డీలక్స్ డ్రమ్ కిక్ – రూ.60,760
హీరో హెచ్ఎఫ్ డీలక్స్ డ్రమ్ సెల్ఫ్ – రూ.66,408
హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఐ3ఎస్ డ్రమ్ సెల్ఫ్ – రూ.67,908
హీరో హెచ్ఎఫ్ డీలక్స్ గోల్డ్ – రూ.67,208.