Hero EV Charging Stations | 2022 కల్లా 10 వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లు.. మాసివ్ మొబిలిటీతో హీరో ఎలక్ట్రిక్ టైఅప్!
Hero EV Charging Stations | దేశవ్యాప్తంగా అదనంగా 10 వేల చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పుతామని హీరో ఎలక్ట్రిక్ శుక్రవారం తెలిపింది.

Hero EV Charging Stations | అన్ని వాహనాలకు చార్జింగ్ ఫెసిలిటీ కల్పిస్తూ దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ చార్జింగ్ వసతులను విస్తరించాలని ప్రణాళిక రూపొందించినట్లు ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీసంస్థ హీరో ఎలక్ట్రిక్ శుక్రవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా అదనంగా 10 వేల చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పుతామని తెలిపింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ మౌలిక వసతుల కల్పన కోసం మాసివ్ మొబిలిటీ సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది లోపు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు హీరో ఎలక్ట్రిక్ వివరించింది.
తాము ఏర్పాటు చేసే చార్జింగ్ స్టేషన్ల నెట్ వర్క్ అన్ని ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్కు వెసులుబాటుగా ఉంటుందని తెలిపింది. ఈవీ చార్జింగ్ స్టేషన్ల వినియోగంపై కన్జూమర్ల వైఖరిపై తమ సంస్థలు సర్వే జరిపామన్నది.
ఇంటర్నెట్లో యాప్ ద్వారా స్మార్ట్ చార్జర్ల కోసం వినియోగదారులు (ఎలక్ట్రిక్ వెహికల్ యజమానులు) వెతుకుతున్నారు. 16 ఏఎంపీ చార్జింగ్ స్టేషన్ల వద్ద లాంగ్ చార్డ్స్ ఉన్నాయి. మాసివ్ చార్జింగ్ యాప్‌లో యూజర్లు తమ ప్రొఫైల్ సెటప్ చేస్తే వారికి వై-ఫై నెట్వర్క్ సహాయకారిగా ఉంటుంది. దీంతో యూపీఐ ఫ్రేమ్ వర్క్ ద్వారా నిరంతరాయ చెల్లింపులు జరుపవచ్చు అని హీరో ఎలక్ట్రిక్ తెలిపింది.
తదుపరి దశకు ఈవీ ఇండస్ట్రీని తీసుకెళ్లేందుకు కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దోహదం చేస్తాయి. పర్యావరణ హిత వ్యవస్థను నెలకొల్పడానికి రీ సైక్లింగ్ మెకానిక్స్‌తో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని హీరో ఎలక్ట్రిక్ సీఈవో సోహిందర్ గిల్ తెలిపారు.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సుమారు 1650 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశాం, 2022 చివరికల్లా 20 వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని సోహిందర్ గిల్ వెల్లడించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

