Hero Bikes | న్యూఢిల్లీ, నవంబర్ 4: ద్విచక్ర వాహన తయారీలో అగ్రగామి సంస్థ హీరో మోటోకార్ప్ టాప్‌గేర్‌లో దూసుకుపోయింది. ప్రస్తుత పండుగ సీజన్లో 15.98 లక్షల వాహనాలను విక్రయించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో అమ్ముడైన వాహనాలతో పోలిస్తే 13 శాతం అధికమని పేర్కొంది. 32 రోజులపాటు కొనసాగిన పండుగ సీజన్లో ఈ స్థాయిలో వాహనాలు విక్రయించడం ఇదే తొలిసారని హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు.
ఆజాద్‌కు 700 కోట్ల ఆర్డర్
హైదరాబాద్, నవంబర్ 4: హైదరాబాద్‌కు చెందిన ఏరోస్పెస్ అండ్ రక్షణ రంగ కీలక పరికరాల సంస్థ ఆజాద్ ఇంజినీరింగ్ మరో భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. జపాన్‌కు చెందిన మిత్సుబిషి నుంచి 82.89 మిలియన్ డాలర్ల(రూ.700 కోట్లకు పైనే) విలువైన ఆర్డర్ లభించినట్లు పేర్కొంది. ఈ ఆర్డర్లో భాగంగా అత్యంత నాణ్యమైన ఇంజినీరింగ్ అండ్ కాంప్లెక్స్ రొటేటింగ్, స్టేషనరీకి సంబంధించి సరఫరా చేయాల్సి ఉంటుందని వెల్లడించింది.