హైదరాబాద్, సెప్టెంబర్ 19: ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్..తాజాగా తెలంగాణలో ఐస్‌క్రీం ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. షామీర్పేట్లో రూ.204 కోట్ల పెట్టుబడితో నెలకొల్పబోతున్నట్లు తెలిపింది. ఈ ప్లాంట్ ఏర్పాటునకు సంబంధించి కంపెనీ బోర్డు డైరెక్టర్లు సమావేశమై గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తెలుగు రాష్ర్టాల్లో ఐస్‌క్రీంకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో పెట్టుకొని ఈ యూనిట్‌ను నెలకొల్పాలని నిర్ణయించినట్లు, వచ్చే ఏడాది నవంబర్ నాటికి ఈ యూనిట్ అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ వర్గాల వెల్లడించాయి.
సేల్స్‌ఫోర్స్ విస్తరణ
శాన్ ఫ్రాన్సిస్కో, సెప్టెంబర్ 19: కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సేవల సంస్థ సేల్స్‌ఫోర్స్..భారత్‌లో తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరులలో ఉన్న సెంటర్లను ఆధునీకరించడానికి మరిన్ని పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి బ్రియాన్ మిల్హమ్ తెలిపారు. మరోవైపు, కంపెనీ దేశీయ హెడ్ అరుంధతీ భట్టాచార్య మాట్లాడుతూ..భారత్‌లో ఉద్యోగుల సంఖ్య ను గడిచిన రెండేండ్లలో రెండింతలు పెంచినట్లు, ప్రస్తుతం 13 వేల మంది విధులు నిర్వహిస్తున్నారని, మరింత మందిని తీసుకునే అవకాశాలున్నట్లు చెప్పారు.