Best Mileage Cars | కార్ల తయారీ సంస్థలు ఒకదాని తర్వాత మరొకటి కొత్త మోడల్ కార్లను ఆవిష్కరిస్తున్నాయి. వాటిల్లో కొన్ని కొనుగోలు దారుల బడ్జెట్లోనే ఉంటే.. మరికొన్ని బడ్జెట్‌ను మించి ధర పలుకుతున్నాయి. అయితే, ప్రస్తుతం దేశంలో పెట్రోల్ కార్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. బెటర్ మైలేజీకి, తక్కువ మెయింటెనెన్స్‌కు పెట్టింది పేరు పెట్రోల్ కార్లు. వాటిలో మన బడ్జెట్ పరిధిలోకి వచ్చే కార్లు కూడా ఉన్నాయి. వినియోగదారుల్లో ఫ్యూయల్ ఎఫిషియెన్సీకి రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నది. మార్కెట్లోకి లీటర్ పెట్రోల్‌పై 26 కిలోమీటర్లకు పైగా మైలేజీ ఇచ్చే కార్లు కూడా రాబోతున్నాయి. ఫ్యూయల్ ఎఫిషియెన్సీలో టాప్-10 కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఎనిమిది కార్లు కూడా మారుతి సుజుకివే కావడం గమనార్హం. మీరూ ఆ కార్లు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. అయితే ఓ లుక్కేయండి..
ఏ కంపెనీ కారైనా.. ఏ మోడల్ అయినా.. బేస్ వేరియంట్ కారులో మీరు పలు సేఫ్టీ ఫీచర్లు పొందొచ్చు. డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్‌లు (డ్రైవర్‌తోపాటు ఫ్రంట్ ప్యాసింజర్), స్పీడ్ అలర్ట్, సీట్ బెల్ట్ అలర్ట్, ఈబీడీ విత్ ఏబీఎస్ వంటి పలు సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. తక్కువ ధరకే బెటర్ సేఫ్టీ ఫీచర్లు గల కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
మారుతి సుజుకి కొత్తగా ఆవిష్కరించిన సెలేరియో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ మోడల్ కారు లీటర్ పెట్రోల్‌కు 26.68 కి.మీ మైలేజీ ఇస్తుంది. అయితే మాన్యువల్ వేరియంట్ లీటర్‌పై 24.97 కి.మీ మైలేజీనిస్తుంది. దీనికి డ్యుయల్ జెట్ కే10 పెట్రోల్ ఇంజిన్ అమరుస్తారు. 67 హెచ్‌పీ సామర్థ్యంతో 89 ఎన్ఎం టార్చ్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ గేర్బ్యాక్స్తో ఈ ఇంజిన్ రూపుదిద్దుకున్నది. దీని ధర రూ.4.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
బెస్ట్ మైలేజీనిచ్చే మారుతి సుజుకి కార్లలో డిజైర్ రెండో స్థానంలో ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ మోడల్ డిజైర్ లీటర్ పెట్రోల్‌పై 24.12 కి.మీ మైలేజీ కల్పిస్తుంది. మాన్యువల్ వేరియంట్‌తో 23.26 కి.మీ. మైలేజీ లభిస్తుంది. ఈ కార్లలో 1.2 లీటర్ల కే12 ఎం పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. 88.50 హెచ్‌పీ సామర్థ్యంతో 113 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. డిజైర్ ఇంజిన్ కూడా 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో డిజైన్ చేశారు. దీని ధర రూ.5.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
మారుతి సుజుకితో టయోటా కిర్లోస్కర్ మోటార్స్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఒక సంస్థ డిజైన్, టెక్నాలజీని మరో సంస్థ షేర్ చేసుకుంటాయి. మారుతి సుజుకి కార్లను పోలిన కార్లను టయోటా కూడా ఆవిష్కరిస్తుంది. మారుతి బాలెనో, టయోటా గ్లాన్జా ఒకే ప్లాట్‌ఫామ్‌పై తయారైనవే. ఈ రెండు కార్లు లీటర్ పెట్రోల్‌పై 23.87 కి.మీ. మైలేజీనిస్తాయి. రెండింటిలోనూ 1.2 లీటర్ల సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. అది 90 హెచ్‌పీ సామర్థ్యంతో 113 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. బాలెనో లేదా గ్లాన్జా ఇంజిన్‌ను 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో డిజైన్ చేశారు. ఈ రెండు కార్లు మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ మోడ్‌లో అందుబాటులో ఉన్నాయి. బాలెనో రూ.5.99 లక్షలు, గ్లాన్జా ధర రూ.7.49 లక్షల నుంచి మొదలవుతుంది.
ఇతర కార్ల తయారీ సంస్థలతో పోలిస్తే మెరుగైన మైలేజీనివ్వడంలో మారుతి కార్లు ముందుంటాయి. ఆ జాబితాలో మారుతి స్విఫ్ట్ కూడా ఉంటుంది. మారుతి స్విఫ్ట్ కారు లీటర్ పెట్రోల్‌పై 23.76 కి.మీ. మైలేజీ ఇస్తుంది. 1.2 లీటర్ల ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్.. గరిష్ఠంగా 90 హెచ్‌పీ సామర్థ్యం కలిగి ఉంటుంది. 113 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. దీన్ని 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో డిజైన్ చేశారు. స్విఫ్ట్ ధర రూ.5.85 లక్షల నుంచి మొదలవుతుంది.
బెస్ట్ మైలేజీ కార్లలో టాప్-5లో మారుతి ఆల్టోను కూడా చేర్చుకోవచ్చు. ఈ కారు లీటర్‌పై 22.05 కి.మీ. మైలేజీనిస్తుంది. 800సీసీ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ గరిష్ఠంగా 48 హెచ్‌పీ సామర్థ్యంతో 69 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రూపుదిద్దుకున్న ఆల్టో కారు రూ.3.15 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
బెస్ట్ మైలేజీ కార్ల జాబితాలో రెనాల్ట్ కూడా చోటు దక్కించుకున్నది. రెనాల్ట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ క్విడ్ కారు లీటర్ పెట్రోల్‌పై 22 కి.మీ. మైలేజీనిస్తుంది. ఈ కారు ఇంజిన్ రెండు ఆప్షన్లలో లభిస్తుంది. 800 సీసీ సామర్థ్యం ఇంజిన్ గల ఈ కారు గరిష్ఠంగా 54 హెచ్‌పీ సామర్థ్యంతో 72 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 1.0 లీటర్ పెట్రోల్ సామర్థ్యం గల ఇంజిన్ గరిష్ఠంగా 68 హెచ్‌పీ సామర్థ్యంతో 91 ఎన్ఎం టార్చినిస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఇంజిన్ డిజైన్ చేశారు. ఈ కారు ధర రూ.4.11 లక్షల నుంచి మొదలవుతుంది.
డస్టన్ రెడీగో ఆటోమేటిక్ వేరియంట్ కారు కూడా టాప్-10 మైలేజీ కార్ల సరసన చేరుతుంది. ఈ కారు లీటర్‌పై 22 కి.మీ. మైలేజీ కల్పిస్తుంది. ఇది రెండు ఇంజిన్ల ఆప్షన్లలో లభిస్తుంది. 800 సీసీ సామర్థ్యం గల ఇంజిన్ గరిష్ఠంగా 68 హెచ్‌పీ సామర్థ్యంతో 72 ఎన్ఎం టార్చి జారీ చేస్తుంది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ గరిష్ఠంగా 68 హెచ్‌పీ సామర్థ్యంతో 91 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఈ ఇంజిన్ కూడా 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో డిజైన్ చేశారు. దీని ధర 3.98 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
ఎక్కువ మైలేజీనిచ్చే కార్ల జాబితాలో మారుతి వాగన్ఆర్ కూడా వస్తుంది. ఈ కారు లీటర్ పెట్రోల్‌పై 21.79 లీటర్ల మైలేజీ అందిస్తుంది. 1.0 లీటర్ లేదా 1.2 లీటర్ల ఇంజిన్ ఆప్షన్ గల కార్లను కొనుగోలు చేయొచ్చు. 1.2 లీటర్ల ఇంజిన్ గరిష్ఠంగా 83 హెచ్‌పీ వద్ద 113 ఎన్ఎం టార్చి జారీ చేస్తుంది. రెండు ఇంజిన్లు 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో పని చేస్తాయి. వాగన్ఆర్ మోడల్ కారు విపణిలో ఆవిష్కరించినప్పటి నుంచి బెస్ట్ సెల్లింగ్ కారుగా ఉంది. దీని ధర రూ.4.93 లక్షలతో మొదలవుతుంది.
మారుతి ఎస్-ప్రెస్సో కూడా టాప్-10 మైలేజీ కార్లో ఒకటి. ఈ కారు లీటర్ పెట్రోల్‌తో 21.7 కి.మీ. మైలేజీ ఇస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ మోడల్ 24.12 కి.మీ. మైలేజీ కల్పిస్తుంది. 1.2 లీటర్ల కే12 ఎం పెట్రోల్ ఇంజిన్.. 88.50 హెచ్‌పీ సామర్థ్యంతో 113 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో ఇంజిన్ రూపుదిద్దుకున్నది. ఈ మోడల్ కారు ధర రూ.5.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
ఇక మారుతి సుజుకిలో టాప్ మైలేజీ కార్లలో ఇగ్నిస్ కూడా ఉంది. లీటర్ పెట్రోల్‌పై 20.89 కి.మీ. ప్రయాణించొచ్చు. 1.2 లీటర్ల కే12 పెట్రోల్ ఇంజిన్ గరిష్ఠంగా 83 హెచ్‌పీ సామర్థ్యంతో 113 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్లలో లభిస్తుంది. 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో ఇంజిన్ రూపుదిద్దుకున్నది. ఇగ్నిస్ కారు ధర రూ.5.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.