ముంబై, సెప్టెంబర్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు 100 డాలర్ల దిగువకు పడిపోవడం, దేశ వృద్ధిరేటు అంచనాలను సవరించడం మదుపర్లను కొనుగోళ్ల వైపు నడిపించాయి. ప్రధానంగా మెటల్, ఆర్థిక, ఎఫ్ఎంసీజీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుకు తోడు గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సంకేతాలు సూచీలను లాభాల్లోకి వచ్చేటట్టు చేశాయి.
మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 299.17 పాయింట్లు లాభపడి 74,828.25 వద్ద నిలిచింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 117.80 పాయింట్లు అందుకొని 23,446.80 వద్ద స్థిరపడింది.