మెజారిటీ లేని నిర్ణయాలు చట్ట విరుద్ధమే!
ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) విషయంలో భారత ఎన్నికల సంఘం(ఈసీఐ)లో అంతర్గతంగా తలెత్తిన విభేదాలపై మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు, అధికారుల నుంచి భిన్నమైన స్పందనలు వ్యక్తమయ్యాయి. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ ఈసీఐలో తలెత్తిన విభేదాలపై ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించిన వార్తాకథనంపై స్పందిస్తూ, వీటిని అత్యంత తీవ్రమైనవి, దురదృష్టకరమైనవిగా అభివర్ణించారు.
- ఈసీఐలో విభేదాలపై మాజీ సీఈసీల స్పందన
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) విషయంలో భారత ఎన్నికల సంఘం(ఈసీఐ)లో అంతర్గతంగా తలెత్తిన విభేదాలపై మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు, అధికారుల నుంచి భిన్నమైన స్పందనలు వ్యక్తమయ్యాయి. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ ఈసీఐలో తలెత్తిన విభేదాలపై ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించిన వార్తాకథనంపై స్పందిస్తూ, వీటిని అత్యంత తీవ్రమైనవి, దురదృష్టకరమైనవిగా అభివర్ణించారు. తన పదవీకాలంలో నిర్ణయాలు సాధారణంగా ఏకగ్రీవంగా తీసుకునేవారమని, భిన్నాభిప్రాయాలను ఏకాభిప్రాయం ద్వారా పరిష్కరించుకొనేవారమని రావత్ చెప్పారు. కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ఉపయోగించే చట్టబద్ధమైన పత్రమైన ఫారమ్ 6లో ప్రతిపాదించిన మార్పుల పట్ల కూడా రావత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫారమ్ 6లో మార్పును రావత్ పూర్తిగా తప్పు, చట్టవిరుద్ధం అని పేర్కొన్నారు.
మాజీ సీఈసీ వై ఖురేషి స్పందిస్తూ.. సీఈసీ, ఈసీల చట్టం, 2023లోని సెక్షన్ 18ను ప్రస్తావిస్తూ కమిషన్ కార్యకలాపాలు సాధ్యమైనంత వరకు ఏకగ్రీవంగా జరగాలని, భిన్నాభిప్రాయాలు తలెత్తినపుడు మెజారిటీ ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవాలని ఆ సెక్షన్ పేర్కొంటున్నదని ఖురేషి గుర్తు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా నిర్ణయాలు తీసుకున్నారా, లేదా అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం అనేది ముగ్గురు సభ్యులతో కూడిన ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అని, అది కేవలం దాని చైర్పర్సన్కు చెందినది మాత్రమే కాదని పేర్కొన్నారు. మరో మాజీ సీఈసీ టీఎస్ కృష్ణమూర్తి కూడా ఈ అంశంపై స్పందిస్తూ ఓటర్ల జాబితాల ప్రక్షాళనతో పాటు ఓటర్లకు తగిన భద్రతా చర్యలను సమతుల్యం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్షిప్స్లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

