హైదరాబాద్, ఏప్రిల్ 15: హియరింగ్ కేర్ సొల్యుషన్స్ సంస్థ హియర్జాప్..హైదరాబాద్‌లో తన 100వ స్టోర్‌ను ప్రారంభించింది.
ఈ సందర్భంగా సిమెన్స్ వినికిడి సాధనాల సీఈవో ఎస్కే శర్మ మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా హియరింగ్ కేర్ మార్కెట్ భారీ వృద్ధిని నమోదు చేసుకుంటుండటంతో వచ్చే రెండేండ్లలో స్టోర్ల సంఖ్యను 250కి పెంచుకోనున్నట్లు ప్రకటించారు. అలాగే భవిష్యత్తులో 500కి పెంచుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు.