HDFC | భారతీయులకు చౌకగా సొంతింటి కల సాకారం చేసేందుకు హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) చర్యలు చేపట్టనున్నది. ఇందుకోసం సిండికేటెడ్ సోషల్ లోన్ ఫెసిలిటీ కింద 1.1 బిలియన్ల డాలర్ల (సుమారు రూ.8,700 కోట్లు) నిధులు సేకరించింది. రుణాల విభాగంలో ఇది అతిపెద్ద సోషల్ లోన్ అని పేర్కొంది. సిండికేటెడ్ లోన్ ఫెసిలిటీ కింద ఇన్వెస్టర్ల గ్రూప్ ఈ రుణం అందజేయనున్నది. 0.90 శాతానికి పైగా ఎస్వోఎఫ్ఆర్ ( secured overnight financing rate ) కింద ఈ రుణ ప్యాకేజీ పొందినట్లు తెలిపింది. ఈ నిధిని తక్కువ ధరకే ఇండ్ల వసతి, సుస్థిరాభివృద్ధి అనుబంధ ప్రాజెక్టులకు రుణ పరపతి కల్పించడానికి ఉపయోగించనున్నది.
చౌకగా ఇండ్ల రుణ వసతి కల్పన సంస్థల్లో లీడ్ సోషల్ లోన్ కోఆర్డినేటర్‌గా ఎంయూఎఫ్‌జీ బ్యాంక్ లిమిటెడ్ కొనసాగనున్నది. సీటీబీసీ బ్యాంక్, బిజుహో బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సుమితోమొ మితుషుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ తదితర సంస్థలు జాయింట్ సోషల్ లోన్ కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తాయి.
ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ (ఈసీబీ) మార్గంలో ఈ నిధి సేకరించామని హెచ్డీఎఫ్సీ వివరించింది. దేశంలోనే అతిపెద్ద సామాజిక రుణ పరతి కల్పించిన సంస్థగా హెచ్డీఎఫ్సీ పలు మైలురాళ్లు దాటింది. 1977లో ఆవిర్భవించిన హెచ్డీఎఫ్సీ 95 లక్షల ఇండ్ల నిర్మాణానికి రూ.6.7 లక్షల కోట్ల రుణాలిచ్చింది.