ఐదో స్థానంతో ముగించి..!
ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచకప్‌ను భారత్ ఐదో స్థానంతో ముగించింది. గురువారం జరిగిన క్లాసిఫికేషన్ మ్యాచ్‌లో స్టార్ ఫార్వర్డ్ నవనీత్ కౌర్ డబుల్ గోల్స్‌తో మెప్పించడంతో 3-1తో జర్మనీని ఓడించింది.
ఆమ్స్టెల్వీన్ : ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచకప్‌ను భారత్ ఐదో స్థానంతో ముగించింది. గురువారం జరిగిన క్లాసిఫికేషన్ మ్యాచ్‌లో స్టార్ ఫార్వర్డ్ నవనీత్ కౌర్ డబుల్ గోల్స్‌తో మెప్పించడంతో 3-1తో జర్మనీని ఓడించింది. 1974 తొలి ఎడిషన్‌లో నాలుగో స్థానంలో నిలిచిన తర్వాత ఈ టోర్నీలో భారత అమ్మాయిలకు ఇదే అత్యత్తమ ప్రదర్శన కావడం విశేషం.ఈ మ్యాచ్ ప్రథమార్ధంలో ఇరు జట్లు డిఫెన్స్ సత్తా చాటడంతో ఒక్క గోల్ కూడా రాలేదు.
అయితే, 43వ నిమిషంలో ఇషిక ఫీల్డ్ గోల్‌తో భారత్‌కు తొలి ఆధిక్యాన్ని అందించింది. 44వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచిన నవనీత్.. 47వ నిమిషంలో ఫీల్డ్ గోల్‌తో జట్టు విజయం ఖాయం చేసింది. ఆట చివరి క్షణాల్లో లిన్ క్రింగ్స్ ఫీల్డ్ గోల్ సాధించినా అది జర్మనీ ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

