ఐదు మ్యూచువల్ ఫండ్ ఎన్‌ఎఫ్‌వోలు సబ్‌స్క్రిప్షన్‌కు వచ్చాయిప్పుడు. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు తెచ్చిన ఆ న్యూ ఫండ్ ఆఫర్స్ (ఎన్ఎఫ్వో)ను పరిశీలిస్తే.. వాటిలో నాలుగు ఇండెక్స్ ఫండ్లు, ఒక లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ యూనిట్లను వాటి నికర ఆస్తి విలువ (ఎన్ఏవీ) నిర్ణయానికి ముందే మదుపరులు చేజిక్కించుకొనేందుకు ఎన్‌ఎఫ్‌వోలు వీలు కల్పిస్తాయి. తద్వారా ఇన్వెస్టర్లు దీర్ఘకాలంలో లాభాలను ఒడిసి పట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక సదరు మ్యూచువల్ ఫండ్ మొదలైతే సంబంధిత నికర ఆస్తి విలువను చెల్లించి ఇన్వెస్టర్లు తమ యూనిట్లను సొంతం చేసుకోవచ్చు.
డీఎస్పీ నిఫ్టీ హెల్త్‌కేర్ ఇండెక్స్ ఫండ్, డీఎస్పీ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఫండ్, టాటా నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ల సబ్స్క్రిప్షన్ గడువు జూన్ 16న ముగుస్తున్నది. మోతీలాల్ ఓస్వాల్ బీఎస్ఈ 1000 ఇండెక్స్ ఫండ్ సబ్స్క్రిప్షన్ గడువు జూన్ 19 వరకు ఉన్నది.
సామ్కో లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్ సబ్స్క్రిప్షన్ జూన్ 19తో ముగుస్తున్నది. అయితే గ్రో నిఫ్టీ 500 లో వొలటాలిటీ 50 ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్), నిప్పాన్ ఇండియా ఇన్కమ్ ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ సబ్స్క్రిప్షన్ల గడువు జూన్ 11నే అయి పోయింది.