HDFC Bank Aditya Puri| హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆదిత్యపూరి హైలేట్.. రిటైర్మెంట్లోనూ హై శాలరీ!
HDFC Bank Aditya Puri| తన రిటైర్మెంట్ సంవత్సరంలోనూ అత్యధిక వేతన భత్యాలు అందుకున్న బ్యాంకర్‌గా ఆదిత్య పూరి నిలిచారు. వేతనంగా రూ.13.82 కోట్లు ....

న్యూఢిల్లీ: ఆదిత్య పూరి.. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు సుదీర్ఘ కాలం సీఈవోగా పని చేసి గతేడాది రిటైరయ్యారు. తన రిటైర్మెంట్ సంవత్సరంలోనూ అత్యధిక వేతన భత్యాలు అందుకున్న బ్యాంకర్‌గా ఆదిత్య పూరి నిలిచారు. దేశంలోని టాప్-3 ప్రైవేట్ బ్యాంకుల అధినేతల్లో ఆదిత్య పూరీ.. వేతనంతోపాటు ఇతర భత్యాలు అత్యధికంగా రూ.13.82 కోట్లు తీసుకున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.3.5 కోట్లు కూడా వీటిల్లో జత కలిశాయి.
హెచ్డీఎఫ్సీ సీఈవోగా శశిధర్ జగదీశన్
ఆయన స్థానంలో గతేడాది అక్టోబర్ 27వ తేదీన సీఈవో కం మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శశిధర్ జగదీశన్ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.4.77 కోట్ల స్థూల వేతనం అందుకున్నారు.
స్ఫూర్తిగా ఐసీఐసీఐ ఎండీ సందీప్ బక్షి
హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రత్యర్థి బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ కం సీఈవో సందీప్ బక్షి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో స్వచ్ఛందంగా ఆయన బేసిక్ అండ్ సప్లిమెంటరీ అలవెన్స్‌లు వదులుకున్నారు.
అలవెన్స్‌ల పేరిట రూ.కోటి స్వీకరణ
అయినప్పటికీ అలవెన్స్‌లు తదితరాల కింద రూ.38.38 లక్షల మేరకు సందీప్ బక్షి అందుకున్నారని ఐసీఐసీఐ బ్యాంక్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పెర్ఫార్మెన్స్ బోనస్ కింద రూ.63.60 లక్షలు అదనంగా అందుకున్నారు బక్షి.
యాక్సిస్ బ్యాంక్‌లో నో శాలరీ ఇంక్రిమెంట్స్
మూడో స్థానంలో ఉన్న యాక్సిస్ బ్యాంక్ సారధి అమితాబ్ చౌదరి వార్షిక వేతనంగా రూ.6.52 కోట్లు అందుకున్నారు. అయితే 2020-21లో టాప్ మేనేజ్మెంట్కు ఎటువంటి శాలరీ ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు.
ఐసీఐసీఐ బ్యాంకులో ఇలా స్వచ్ఛంద కోతలు
ఒక ఐసీఐసీఐ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతోపాటు చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్, కంపెనీ సెక్రటరీ తదితరులు కరోనా మహమ్మారి ప్రభావం నేపథ్యంలో గత మే నుంచి తమ వేతనాల్లో 10 శాతం తగ్గించుకుంటామని స్వచ్ఛందంగా ప్రకటించారు. హోల్‌సేల్ బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్చార్జి విశాఖ ముల్యే స్థూలంగా రూ.5.64 కోట్ల వేతనం తీసుకున్నారు.
యాక్సిస్ బ్యాంకులో 200 మంది గుడ్‌బై
ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగుల్లో ఒకరు 139 రెట్లు, 104 రెట్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో 96 రెట్లు వేతనాన్ని అందుకున్నారు. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రూ.8.5 లక్షల పై చిలుకు వేతనం అందుకున్న 200 మంది ఎగ్జిక్యూటివ్‌లు మధ్యలో రాజీనామా చేశారు.
ఇవి కూడా చదవండి:
Tokyo Olympics: టేబుల్ టెన్నిస్ మూడో రౌండ్లో మనికా బాత్రా
ఇండియా రెజ్లర్ ప్రియా మాలిక్‌కు గోల్డ్ మెడల్
Tokyo Olympics: మహిళల టెన్నిస్ డబుల్స్‌లో సానియా జోడీ ఓటమి
Tokyo Olympics: ఆ ముగ్గురు తప్ప.. రెండో రోజు ఇండియాకు నిరాశే
Mirabai Chanu: మీరాబాయి చాను టాప్ 10 ఇంస్టాగ్రామ్ పోస్టులు
భారత్‌లో టెస్లా యూనిట్.. ఎలన్ మస్క్ ఏమన్నారంటే?
చైనా.. అమెరికాను భారత్ దాటుతుందా.. ముకేశ్ అంబానీ ఏం చెప్పారు?
ITR FY2021-22.. ఇలా ఐటీఆర్ ఫైలింగ్ ఈజీ.. 5 హెడ్స్ కింద ఇన్‌కం వర్గీకరణ
Home loan Vs Plot loan| ఇంటిపై లోన్ తీసుకోవడం బెటరా.. ఇంటి స్థలంపైనా ? ఏది బెస్ట్ ?
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- aditya puri
- hdfc bank
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!

