ITR FY2021-22.. ఇలా ఐటీఆర్ ఫైలింగ్ ఈజీ.. 5 హెడ్స్ కింద ఇన్‌కం వర్గీకరణ
ITR FY2021-22.. ఇలా ఐటీఆర్ ఫైలింగ్ ఈజీ..| మనదేశంలో ప్రతి ఒక్కరూ సంపాదించే ఆదాయం.. ఇన్‌కం టాక్స్ పరిధిలోకి వస్తుంది. వివిధ మార్గాల్లో సంపాదించే ....

న్యూఢిల్లీ: మనదేశంలో ప్రతి ఒక్కరూ సంపాదించే ఆదాయం.. ఇన్‌కం టాక్స్ పరిధిలోకి వస్తుంది. వివిధ మార్గాల్లో సంపాదించే ఆదాయాన్ని ఆదాయం పన్ను శాఖ సరళతరం చేసింది. వాటిని ఐదు భాగాలుగా విడదీసింది. వేతన ఆదాయం, ఆస్తులపై వచ్చే సంపాదన, వ్యాపారం & వ్రుత్తి రీత్యా వచ్చే లాభాలు, పెట్టుబడిపై ఆదాయం, ఇతర వనరుల నుంచి వచ్చే సంపాదనగా ఇన్‌కం టాక్స్ విభాగం వర్గీకరించింది.
విభిన్న మార్గాల్లో వచ్చే ఆదాయానికి విభిన్న నిబంధనలు వర్తిస్తాయి. ఉదాహరణకు సెక్యూరిటీస్ (మ్యూచవల్ ఫండ్స్, ఈక్విటీ షేర్లు)పై వచ్చే ఆదాయాన్ని క్యాపిటల్ గెయిన్ హెడ్ పద్దు కింద చేర్చారు. డివిడెండ్ ఇన్‌కం & వడ్డీ ఆదాయాన్ని ఇతర వనరుల ఆదాయం కింద పరిగణిస్తారు.
ఆదాయం పన్ను చట్టం-1961 ప్రకారం ఆదాయాన్ని ఐదు భాగాలుగా నిర్ణయించారు. వేతనంతో కూడిన ఆదాయం, ఇంటిపై వచ్చే ఆదాయం, వ్యాపార ఆదాయం, మదుపు లేదా పెట్టుబడుల ఆదాయం, విభిన్న మార్గాల్లో వచ్చే ఆదాయంగా విడదీశారు.
ఐటీ చట్టం-1961లోని 14వ సెక్షన్ కింద ఒక వ్యక్తి విభిన్న మార్గాలు, పద్దతుల్లో సంపాదించే ఆదాయాన్ని ఐదు తరగతులుగా నిర్ణయించారు. దీని ప్రకారం ఐటీఆర్ ఫైలింగ్ తేలికవుతుంది.

వేతన ఆదాయం: ఒక వ్యక్తి వేతనం ద్వారా లేదా పెన్షన్ ద్వారా పొందే ఆదాయంపై వేతన ఆదాయం కింద పన్ను నిర్ణయిస్తారు.
వ్యాపారం, ప్రొఫెషన్ ఆదాయం: స్వయం ఉపాధిపై సంపాదించే లాభాలను ఈ క్యాటగిరీలో చేర్చారు. ఇందులో బిజినెస్‌లు, ఫ్రీలాన్సర్లు, కాంట్రాక్టర్లు, ప్రొఫెషనల్స్ వస్తారు. ప్రొఫెషనల్స్‌లో బీమా ఏజంట్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, డాక్టర్లు, లాయర్లు, ట్యూషన్ టీచర్లను కూడా ఈ క్యాటగిరీలో చేర్చారు.
పెట్టుబడి లాభాల నుంచి ఆదాయం: మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, ఇల్లుపై వచ్చే అదనపు ఆదాయాన్ని క్యాపిటల్ గెయిన్స్ ఇన్కంగా పరిగణిస్తారు.
ఇండ్లపై ఆదాయం: ఇండ్లపై అద్దెల రూపేణ వచ్చే ఆదాయం మీద విధించే పన్నును ఈ క్యాటగిరీ కింద నిర్ధారిస్తారు.
ఇతర వనరులు: బ్యాంకు సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ, లాటరీల్లో విజయంపై వచ్చే ఆదాయం.. ఇతర వనరుల కింద పరిగణించి పన్ను ఖరారు చేస్తారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- 5 heads
- Income Tax
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

