బెంగళూరు, మే 7: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మరోసారి వడ్డీరేట్లను తగ్గించింది. ఎంసీఎల్ఆర్తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది.
దీంతో నెల రోజుల కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 10 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రుణరేటు 9 శాతానికి దిగిరాగా, అలాగే మూడు నెలల రుణాలపై రేటు 15 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 9.05 శాతానికి దిగొచ్చాయి. ఆరు నెలల రుణాలపై రేటు 9.10 శాతానికి తగ్గాయి.