HDFC Bank MCLR | ప్రైవేట్ రంగ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మరో దఫా కీలక వడ్డీరేట్లు పెంచేసింది. వివిధ రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) 20 బేసిక్ పాయింట్లు (100 బేసిక్ పాయింట్లు ఒక శాతానికి సమానం) పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. గురువారం (2022 జూన్ 7) నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఫలితంగా ఇంటి, వాహన, వ్యక్తిగత, వివిధ రకాల రుణాలపై నెలవారీ రుణ వాయిదా (ఈఎంఐ) పెరుగనున్నది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం ఓవర్నైట్ (15 రోజుల గడువు) రుణాలపై వడ్డీరేటు 7.50 నుంచి 7.70 శాతానికి పెరుగుతుంది. నెల రోజుల టెన్యూర్ గల రుణంపై వడ్డీరేటు 7.75, మూడు నెలల గడువు గల రుణంపై వడ్డీరేటు 7.80, ఆరు నెలల టెన్యూర్ గల రుణంపై 7.90 శాతం వడ్డీరేటు విధించనున్నది. ఏడాది టెన్యూర్ రుణాలపై వడ్డీ 8.05, రెండేండ్ల గడువు రుణంపై 8.15, మూడేండ్ల గడువు గల 8.25 శాతం వడ్డీరేటు వసూలు చేయనున్నది.
గత నెల రోజుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 35 బేసిక్ పాయింట్లు పెంచేసింది. దీని ప్రకారం ప్రస్తుత ఎంసీఎల్ఆర్ను బట్టి మీ ఇంటి రుణంపై వడ్డీరేటు.. టెన్యూర్ ఆధారంగా ఇంటి రుణంపై నెలవారీ వాయిదా (ఈఎంఐ) పెరుగుతుంది.