HDFC Bank | దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు ‘హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) ’ వివిధ రుణాలపై వడ్డీరేట్లు పెంచేసింది. సెలెక్టెడ్ టెన్యూర్డ్ రుణాలపై బెంచ్ మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ (ఎంసీఎల్ఆర్ – MCLR).. ఐదు బేసిక్ పాయింట్లు పెంచినట్లు తెలిపింది. పెంచిన వడ్డీరేట్లు ఈ నెల ఏడో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేట్లు 8.65 శాతం నుంచి 9.30 శాతం మధ్య ఉంటాయి. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేట్ ఐదు బేసిక్ పాయింట్లు పెరిగి 8.65 శాతానికి, నెల రోజుల గడువు రుణాలపై ఎంసీఎల్ఆర్ 8.70 శాతం, మూడు నెలల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 8.90 శాతం, ఆరు నెలల టెన్యూర్ పై 9.15 శాతం, రెండేండ్ల గడువు రుణాలపై 9.25, మూడేండ్ల గడువు రుణాలపై 9.30 శాతానికి ఎంసీఎల్ఆర్ పెరిగింది. ఏడాది గడువు రుణాలపై ఎంసీఎల్ఆర్ యధాతథంగా 9.20 శాతం కొనసాగింది.