న్యూఢిల్లీ, నవంబర్ 7: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ గ్రహీతలకు షాకిచ్చింది. ఎంపిక చేసిన రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు పెంచింది.
ఏడాది కాలపరిమితితో అత్యధిక మంది తీసుకునే వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేటు 9.45 శాతానికి చేరుకున్నది. అలాగే ఒక్కరోజు రుణాలపై వడ్డీరేటు 9.10 శాతం నుంచి 9.15 శాతానికి చేరుకోగా, నెల రుణాలపై వడ్డీని ఐదు బేసిస్ పాయిం ట్లు సవరించడంతో రుణ రేటు 9.20 శాతానికి చేరుకున్నది.