ముంబై, ఫిబ్రవరి 16: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)కు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులు తమ రూపే క్రెడిట్ కార్డులను అనుసంధానం చేసుకోవచ్చు. కస్టమర్లకు ఈ అవకాశాన్ని ఇచ్చిన తొలి ప్రైవేట్ రంగ బ్యాంక్ ఇదే కావడం విశేషం. దీంతో ఇక ప్రముఖ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్స్‌పై క్రెడిట్ కార్డును వినియోగించుకునేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు వీలు కలిగినైట్టెంది. ఇప్పటిదాకా బ్యాంక్ ఖాతాదారులు తమ సేవింగ్స్ ఖాతాలనే యూపీఐకి లింక్ చేసుకోవచ్చు. ఇకపై రూపే క్రెడిట్ కార్డునూ యూపీఐ ఐడీకి లింక్ చేసుకోవచ్చు. ఈ నిర్ణయం కస్టమర్లకు మరింత సౌకర్యవంతంగా డిజిటల్ చెల్లింపులు జరుపడానికి దోహదపడగలదని ఈ సందర్భంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇండియా పేమెంట్స్ హెడ్ పరాగ్ రావు అన్నారు. మరోవైపు ఈ అవకాశాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణా రాయ్ కూడా స్వాగతించారు.