హైదరాబాద్, ఆగస్టు 11: జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.275 కోట్ల లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.400.08 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో కంపెనీ నిర్వహణ ఖర్చులు రూ.240.27 కోట్లకు తగ్గాయి.
ఏడాది క్రితం తొలి త్రైమాసికంలో రూ.620.37 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన సంస్థ..గత త్రైమాసికానికి కూడా రూ.515.50 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది.