న్యూఢిల్లీ, నవంబర్ 10: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.156.15 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్.
ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.153.87 కోట్లతో పోలిస్తే 1.48 శాతం పెరిగింది. కానీ, ఆదాయం మాత్రం రూ.1,012.05 కోట్ల నుంచి రూ.395.75 కోట్లకు పడిపోయింది.