హైదరాబాద్, నవంబర్ 14: జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్లీ నష్టాల్లోకి జారుకున్నది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.1.21 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. ఆదాయం తగ్గుముఖం పట్టడం వల్లనే లాభాల్లో గండిపడిందని పేర్కొంది.
క్రితం ఏడాది ఇదే త్రైమాసికానికిగాను సంస్థ రూ.811.19 కోట్ల లాభాన్ని గడించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.412.80 కోట్ల నుంచి రూ.1.32 కోట్లకు పడిపోయింది.