Crisis in Diamond Industry | నాటోలో సభ్యత్వాన్ని నిలువరించే పేరుతో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్నది. మరోవైపు గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంత గ్రామీణ ప్రాంతాల్లో లక్షల కుటుంబాల జీవనంపై ప్రతికూల ప్రభావం పడింది. వజ్రాల వ్యాపారానికి పెట్టింది పేరు గుజరాత్‌లోని సౌరాష్ట్ర. ప్రాసెసింగ్, పాలిషింగ్ కోసం చిన్న సైజ్ వజ్రాలు రష్యా నుంచి సౌరాష్ట్రకు దిగుమతయ్యేదని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర వజ్రాల పరిశ్రమలో సుమారు 15 లక్షల కార్మికులు ఉంటారని జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ రీజియన్ చైర్మన్ దినేష్ నవాదియా చెప్పారు.
రష్యా నుంచి చిన్న సైజ్ వజ్రాల సరఫరాలో కోతతో గుజరాత్‌లోని వజ్రాల వ్యాపారులు ఆఫ్రికా, ఇతర దేశాల నుంచి ముడి వజ్రాలను కొనుగోలు చేస్తున్నారు. పని లేక డైమండ్ యూనిట్స్ వర్కింగ్ అవర్స్‌లో కోత విధించారు. రష్యా కంపెనీలపై నిషేధం కొనసాగుతుండటంతో అమెరికాకు 70 శాతం కట్ చేసిన, పాలిష్డ్ వజ్రాలు ఎగుమతి అవుతున్నాయి. రష్యా నుంచి ముడి వజ్రాలు కొనుగోలు చేయొద్దని ఇప్పటికే అమెరికా కంపెనీల నుంచి ఈ-మెయిల్స్ వచ్చాయని దినేశ్ నవాదియా తెలిపారు.
ఫలితంగా భావ్‌నగర్, రాజ్‌కోట్, అమ్రేలీ, జునాగఢ్ జిల్లాల్లోని వజ్రాల పరిశ్రమల కార్మికులు, కార్మికుల కుటుంబాలపై ప్రతికూల ప్రభావం పడింది. రష్యా నుంచి దాదాపు 27 శాతం ముడి వజ్రాలు దిగుమతి అవుతాయి. కానీ అవి రాకపోవడంతో ఇక్కడ పని నిలిచిపోయిందని నవాదియా తెలిపారు. సుమారు 50 శాతం కార్మికులు చిన్న తరహా డైమండ్స్ ప్రాసెసింగ్‌లో నిమగ్నం అవుతారు. యుద్ధానికి ముందు రష్యా నుంచి సుమారు 30 శాతం ముడి వజ్రాలు దిగుమతి అయ్యేవని చెప్పారు.