బుధవారం 24 ఫిబ్రవరి 2021
Business - Dec 30, 2020 , 01:26:32

ప్రయాణ బీమాకు మార్గదర్శకాలు

ప్రయాణ బీమాకు మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: ప్రయాణ బీమాకు నిర్ధిష్ట మార్గదర్శకాలను అమలు చేయాలని ఐఆర్‌డీఏఐ ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలతో ఓ ముసాయిదాను విడుదల చేసింది. దేశ, విదేశీ ప్రయాణ బీమా కవరేజీ, మినహాయింపులు, షరతులకు సంబంధించిన నిబంధనలను ఈ ముసాయిదాలో పొందుపర్చింది. పాలసీలో పేర్కొన్న విధంగా ప్రయాణ సమయాల్లో మరణించినవారికి, గాయపడినవారికి 365 రోజుల్లోగా నష్టపరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. మృతులు 18 ఏండ్లలోపువారైతే బీమా కవరేజీ మొత్తంలో 50 శాతం వరకే ఇన్సూరెన్స్‌ కంపెనీలు బాధ్యత వహించాలని నిర్దేశించింది. ఫ్లైట్‌ మిస్సైనా, ప్రయాణం ఆలస్యమైనా, పాస్‌పోర్టును లేదా బ్యాగేజీని పోగొట్టుకున్నా నష్టపరిహారాన్ని అందజేయాలని తెలిపింది. విదేశీ ప్రమాద బీమా ఉన్న వ్యక్తులెవరైనా ఇతర దేశాల్లో మరణిస్తే వారి మృతదేహాల తరలింపునకు అయ్యే ఖర్చులకు కూడా బీమా పాలసీ వర్తిస్తుందని పేర్కొన్నది. ఈ ముసాయిదాపై జనవరి 6లోగా అభిప్రాయాలను తెలియజేయాలని బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ విజ్ఞప్తి చేసింది. 

VIDEOS

logo