GST Reforms | కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. జీఎస్టీ కౌన్సిల్ 26వ సమావేశంలో గణనీయమైన మార్పులు చేశారు. హానికారక వస్తువులు మినహా అన్ని ఉత్పత్తులపై జీఎస్టీని 5, 18శాతం రేట్ల పరిధిలోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నాలుగు శ్లాబులు ఉండగా.. ఇకపై రెండు శ్లాబులు మాత్రమే ఉంటాయి. అదనంగా 40శాతం స్పెషల్ పన్ను ఉంటుంది. చాలా వస్తువులపై జీఎస్టీని సున్నాకి తగ్గించిన విషయం తెలిసిందే. ఈ మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి రానున్నాయి. అయితే, అనేక ముఖ్యమైన వస్తువులపై పన్నును సున్నాకి తగ్గించాలని నిర్ణయించారు. ఈ మార్పులు సెప్టెంబర్ 22న, నవరాత్రి మొదటి రోజు నుండి అమల్లోకి వస్తాయి. ఈ మార్పులు సిలిండర్ల ధరను ప్రభావితం చేస్తాయా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఈ నెల 3న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఎల్పీజీపై జీఎస్టీని కౌన్సిల్ ఎలాంటి మార్పులు చేయలేదు. దాంతో జీఎస్టీ పెరగడం లేదంటే తగ్గే అవకాశాలు లేవు. గృహ, వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల జీఎస్టీ రేట్లను సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి రానుండగా.. గతంలో మాదిరిగానే సిలిండర్‌పై గతంలో ఉన్న జీఎస్టీనే వర్తించనున్నది. అయితే, గృహ, వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లపై జీఎస్టీ రేట్లను భిన్నంగా ఉంటాయి. గృహ వినియోగం కోసం సబ్సిడీ, సబ్సిడీ లేని సిలిండర్లు రెండూ 5శాతం జీఎస్టీ శ్లాబులో ఉంటాయి. హోటల్స్, తినుబండారాలు, రెస్టారెంట్లు, ఫుడ్ ట్రక్కులు, మెస్ కిచెన్లు తదితర వాణిజ్య అవసరాల కోసం వినియోగించే కమర్షియల్ సిలిండర్లపై జీఎస్టీ 18శాతం వర్తిస్తుంది. జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చినప్పటికీ డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్లపై రేట్లు యథావిధిగా కొనసాగుతుండడంతో జనాలకు ఊరట కలుగడం లేదు. అయితే, అనేక వస్తువులపై పన్ను కోతలు విధించడంతో కొంత వరకు ఊరట కలిగే అవకాశాలున్నాయి.