న్యూఢిల్లీ, జనవరి 19: కేంద్ర ప్రభుత్వం హెల్మెట్ల పై విధిస్తున్న జీఎస్టీని ఎత్తివేయాలం టూ అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ (ఐఆర్ఎఫ్) డిమాండ్ చేసింది. ప్రస్తుతం హెల్మెట్లపై 18 శాతం వస్తు సేవల పన్నును విధిస్తున్నారు. సురక్షితమైన రహదారుల కోసం కార్యక్రమాలు చేపట్టే ఐఆర్ఎఫ్ తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఒక లేఖరాస్తూ ద్విచక్ర వాహనదారుల ప్రాణ రక్షణ కవచమైన హెల్మెట్లపై 2023-24 కేంద్ర బడ్జెట్లో జీఎస్టీని ప్రస్తుత 18 శాతం నుంచి 0 శాతానికి తగ్గించాలని కోరింది.