న్యూఢిల్లీ, జనవరి 10: జీఎస్టీ సేల్స్ రిటర్నులకు సంబంధించి జీఎస్టీఆర్-1, జీఎస్టీ చెల్లింపులకు సంబంధించిన గడువును మరో రెండు రోజులు పొడిగించింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్(సీబీఐసీ). ఫైలింగ్ రిటర్నులకు సంబంధించి గడిచిన రెండు రోజులుగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పన్ను చెల్లింపుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో గడువు పెంచాలని వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీబీఐసీ ఈ గడువును 13 వరకు పెంచింది. అలాగే క్యూఆర్ఎంపీ స్కీం కింద అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికపు చెల్లింపుల గడువను ఈ నెల 15కి పెంచింది. దీంతోపాటు జీఎస్టీఆర్3బీ కి సంబంధించి జీఎస్టీ చెల్లింపుల గడువును కూడా ఈ నెల 22 వరకు పెంచింది.
క్రిప్టోతో 95 కోట్ల మోసం
హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): నకిలీ వెబ్ సైట్ ద్వారా నగదు చెల్లిస్తే రెట్టింపు రాబడి వస్తున్నదని రూ.95 కోట్లు కొట్టేసిన వ్యక్తిని సీఐడీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈమేరకు కరీంనగర్‌కు చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుని పట్టుకొని రిమాండ్‌కు తరలించామని సీఐడీ డీజీ షిఖా గోయెల్ ప్రకటిం చారు. జనగామ జిల్లా లింగాల ఘన పురం మండలం నెల్లుట్లకు చెందిన కుర్రెముల రమేశ్ గౌడ్ నకిలీ వెబ్ సైట్‌ను సృష్టించారు. జీబీఆర్ అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈ వెబ్సైట్లో పెట్టుబడులు పెడితే క్రిప్టో కరెన్సీ రూపంలో రెట్టింపు లాభం పొంద వచ్చని 43 మంది నుంచి రూ.95 కోట్లు వసూలు చేసి, వీటిని తిరిగి చెల్లించకపోవడంతో మనోజ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో రిమాండ్‌కు తరలించామని చెప్పారు.