GST Collection | రూ.1.60 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు .. ఈ ఏడాదిలో నాలుగోసారి..!
GST Collection | సెప్టెంబర్ నెల జీఎస్టీ వసూళ్లలో మరో రికార్డు నమోదైంది. రూ.1.63 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు రికార్డయ్యాయి. ఈ ఏడాదిలో రూ.1.60 లక్షల కోట్ల పై చిలుకు జీఎస్టీ వసూలు కావడం ఇది నాలుగోసారి.
GST Collection | 2022తో పోలిస్తే సెప్టెంబర్ స్థూల జీఎస్టీ వసూళ్లు 10 శాతం పెరిగి, రూ.1.63 లక్షల కోట్లకు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు దాటడం ఇది నాలుగో సారి. 2023-సెప్టెంబర్లో జీఎస్టీ వసూళ్లు రూ.1,62,712 కోట్లకు చేరాయి. సెప్టెంబర్ నెలతో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో స్థూల జీఎస్టీ వసూళ్లు 11 శాతం గ్రోత్ నమోదు చేశాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.8,93,334 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరగ్గా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.9,92,508 కోట్లకు చేరాయి.
‘గతేడాదితో పోలిస్తే 2023 సెప్టెంబర్లో జీఎస్టీ రెవెన్యూ వసూళ్లు 10 శాతానికి పైగా నమోదయ్యాయి. దిగుమతి సర్వీసులతోపాటు దేశీయ లావాదేవీల ద్వారా 14 శాతానికి పైగా రెవెన్యూ వచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు దాటడం నాలుగో సారి’ అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా సగటున రూ.1.65 లక్షల కోట్ల స్థూల జీఎస్టీ వసూళ్లు నమోదు కాగా, గతేడాది రూ.1.49 లక్షల కోట్లు వసూళ్లయ్యాయి. ఇది 11 శాతం ఎక్కువ. మొత్తం సెప్టెంబర్ జీఎస్టీ వసూళ్లలో జీసీఎస్టీ రూ.29,818 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.37,657 కోట్లు, ఐజీఎస్టీ (దిగుమతి వస్తువులపై సుంకం రూ.41,145 కోట్లతో కలుపుకుని) రూ. 83,623 కోట్లు, దిగుమతి వస్తువులపై సుంకం రూ.881 కోట్లతో కలుపుకుని సెస్ రూ.11,613 కోట్లు వసూలయ్యాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

