హైదరాబాద్, అక్టోబర్ 19: గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన మరో ఔషధానికి అమెరికా నియంత్రణ మండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గుండెల్లో మంట, కడుపులో గ్యాస్‌ను నివారించే ఎసోమెప్రజోల్ మెగ్నీషియంకు జనరిక్ వెర్షన్‌ను అక్కడి మార్కెట్లో విడుదల చేయడానికి అమెరికా నియంత్రణ మండలి యూఎస్ఎఫ్డీఏ అనుమతినిచ్చినట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది.
ఈ క్యాప్సల్స్ 20 ఎంజీ, 40 ఎంజీల్లో లభించనున్నది. ప్రస్తుతం అక్కడి మార్కెట్లో ఎసోమెప్రజోల్ మెగ్నీషియం అమ్మకాలు 168 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నది.