హైదరాబాద్, మే 29: గ్రానైట్ తయారీ సంస్థ పోకర్ణ అంచనాలకుమించి రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.రూ.58.90 కోట్ల నికర లాభాన్ని గడించింది.
అంతక్రితం ఏడాది నమోదైన లాభంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. అలాగే ఆదా యం ఏడాది ప్రాతిదదిన 62.50 శాతం ఎగబాకి రూ.262.68 కోట్లుగా నమోదైంది. 2024-25కిగాను రూ.930.10 కోట్ల ఆదాయంపై రూ. 187.54 కోట్ల లాభాన్ని ఆర్జించింది.