అమ్మకానికి ఎస్‌జేవీఎన్ వాటా
ప్రభుత్వ సంస్థలు పూర్తిగా ప్రైవేటుకు అప్పగించడం లేదా ప్రతీ కంపెనీలో ఎంతోకొంత వాటా అమ్మేసి ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి ఆతృతపడుతున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా జలవిద్యుత్ సంస్థ ఎస్‌జేవీఎన్‌లో షేర్లను విక్రయించడానికి సిద్ధమయ్యింది.
- నిధుల సమీకరణలో కేంద్రం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ప్రభుత్వ సంస్థలు పూర్తిగా ప్రైవేటుకు అప్పగించడం లేదా ప్రతీ కంపెనీలో ఎంతోకొంత వాటా అమ్మేసి ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి ఆతృతపడుతున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా జలవిద్యుత్ సంస్థ ఎస్‌జేవీఎన్‌లో షేర్లను విక్రయించడానికి సిద్ధమయ్యింది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో రెండు రోజులు జరిపే మార్కెట్ బిడ్డింగ్ ద్వారా 4.92 శాతం వాటాను అమ్మకానికి పెట్టింది.
నాన్-రిటైల్ ఇన్వెస్టర్లకు ఎస్‌జేవీఎన్ ఆఫర్ గురువారం ప్రారంభమవుతుందని దీపం కార్యదర్శి తుహిన్‌కాంత్ పాండే ఎక్స్ (గతంలో ట్విటర్)లో పోస్ట్ చేశారు. రిటైల్ ఇన్వెస్టర్లు శుక్రవారం బిడ్స్ వేయవచ్చు. ఓఎఫ్‌ఎస్‌కు షేరుకు రూ. 69 చొప్పున ఫ్లోర్ ధరను నిర్ణయించారు. ఈ ధరపై 4.92 శాతం వాటాకు (9.66 కోట్ల షేర్లు) కేంద్ర ఖజానాకు రూ.650 కోట్లు సమకూరుతుంది. బుధవారం బీఎస్ఈలో ఎస్‌జేవీఎన్ షేరు 6.78 శాతం పెరిగి రూ.81.75 వద్ద ముగిసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

