SBI | న్యూఢిల్లీ, డిసెంబర్ 18 : దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మేనేజింగ్ డైరెక్టర్‌గా రామమోహన్‌రావు అమర నియమితులయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన రామ మోహన్ రావు.. ఈ పదవిలో మూడేండ్లపాటు కొనసాగనున్నారు. ఇప్పటికే బ్యాంక్ డిప్యూటీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న రావుకు పదొన్నతి లభించినట్లు అయింది. గతంలో ఎండీగా విధులు నిర్వహించిన సీఎస్ శెట్టి చైర్మన్‌గా పదొన్నతి పొందడంతో ఈ పోస్ట్ ఖాలీ అయింది. దీంతో శెట్టి స్థానంలో కొత్తగా రామ మోహన్ రావు ఎంపికచేసింది బ్యాంక్ బోర్డు.