FDI in LIC | భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు లైన్ క్లియరైంది. ఎల్ఐసీలో 20 శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలకు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) ద్వారా ఎల్ఐసీలో వాటాలను ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో ఐపీవోకు అనుమతించాలని కోరుతూ ఎల్ఐసీ.. డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేసింది. గత నెలలోనే ఎల్ఐసీ డ్రాఫ్ట్ పత్రాలకు సెబీ ఆమోదం తెలిపింది.
ఫెమా నిబంధనలను సవరిస్తూ కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా గత నెల 14న డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఎల్ఐసీలో భారీస్థాయిలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను అనుమతి ఇస్తూ ఎఫ్‌డీఐ పాలసీలో పలు మార్పులు తీసుకొచ్చింది. కాగా, ఐపీవో ద్వారా ఎల్ఐసీలో రూ.63 వేల కోట్ల విలువైన (ఐదుశాతం) వాటాలను కేంద్రం ఉపసంహరించుకోనున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే.