సైదాబాద్, ఏప్రిల్ 10 : ప్రభుత్వరంగ సంస్థ మిధానీ(మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్) మరో మైలురాయిని సాధించింది. స్వదేశీ ఏరో ఇంజిన్ పదార్థాల అర్హతలో కీలకమైన మైలురాయిని సాధించిన సందర్భంగా కంపెనీ సీఎండీ డాక్టర్ ఎస్వీఎస్ నారాయణ మూర్తికి ఎయిర్‌వర్తినెస్ సర్టిఫికెట్‌ను శుక్రవారం సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్‌వర్తినెస్ అండ్ సర్టిఫికేషన్(సీమిలాక్) సీఈవో ఏపీవీఎస్ ప్రసాద్ అందచేశారు.
ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఆధునిక ఏరో ఇంజిన్లకు అవసరమైన కీలకమైన సూపర్ అల్లాయ్‌లు, టైటానియం అల్లాయ్‌లు, ప్రత్యేక ఉక్కు పదార్థాలను స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేయడంతో ఎయిర్‌వర్తినెస్ (ఉడాన్ యోగ్యత) సర్టిఫికేషన్‌లో ముఖ్యమైన విజయాన్ని సాధించినట్టు అయిందన్నారు. ఈ పదార్థాలలో ఫోర్ట్ బార్లు, హోట్-రోల్డ్ బార్లు, రోల్డ్ రింగులున్నాయని వివరించారు.