హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది. రూ.4,236 కోట్లకుగాను కేవలం రూ.1,000 కోట్లనే ఇచ్చింది. ఇన్నాళ్లూ నూతన ఎంఎస్ఎంఈ విధానం, కొత్త పారిశ్రామిక విధానం పేరుతో తాత్సారం చేసిన రేవంత్ సర్కార్.. తాజాగా రూ.1,000 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పరిశ్రమ వర్గాలు పెదవి విరుస్తున్నాయి.