Google Logo | ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ లోగోలో స్వల్ప మార్పులు చేసింది. దాదాపు పదేళ్ల తర్వాత గూగుల్ తన ఐకానిక్ లోగోలోను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న లోగోలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం బాక్సులుగా కనిపించేవి. దీనికి బదులుగా ఇకపై ఎరుపు పసుపు రంగులోకి, పసుపు ఆకుపచ్చ రంగులోకి, ఆకుపచ్చ నీలం రంగులోనే కొత్త గ్రేడియంట్ డిజైన్‌ను తీసుకువచ్చింది. అయితే, గూగుల్ త్వరలో మరికొన్ని ఆర్టిఫిషియల్ ఫీచర్స్‌ను పరిచయం చేయబోతున్నది. ఈ క్రమంలోనే కంపెనీ కొత్తగా గ్రేడియంట్ డిజైన్లోకి లోగోని మార్చినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం గూగుల్ లోగో ప్రస్తుతం ఐవోఎస్, పిక్సెల్ డివైజ్‌లలో కనిపిస్తున్నది. దాంతో పాటు గూగుల్ 16.18 బీటా వెర్షన్ ఉన్న ఆండ్రాయిడ్ డివైజ్‌లలోనూ ఈ లోగో కనిపిస్తున్నది.
ఇదిలా ఉండగా.. గూగుల్ ప్రధానమైన వర్డ్‌మార్క్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. గూగుల్ ప్రస్తుతం తన ఉత్పత్తుల్లో ఏఐకి పెద్దపీట వేస్తున్నందున.. భవిష్యత్‌లో గ్రేడియంట్ డిజైన్ని ఇతర సేవలకు విస్తరించే అవకాశాలున్నాయని ఓ నివేదిక తెలిపింది. టెక్ దిగ్గజం 2015 తర్వాత తొలిసారిగా లోగోలో మార్పులు చేయడం విశేషం. గూగుల్ కొత్త లోగోపై సోషల్ మీడియా వేదికగా పలువురు స్పందించారు. కొందరు లోగో బాగుందని చెప్పగా.. తేడా ఏం కనిపించడం లేదని తెలిపారు. గూగుల్ లోగో మార్చారా? నాకు పాత లోగోనే ఇష్టమని.. కొత్తదానికంటే పాతదే బాగా కనిపిస్తుందని ఓ యూజర్ చెప్పాడు. ఏఐ, డిజిటల్ ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న నేపథ్యంలో లోగోను మరింత డైనమిక్‌గా, స్క్రీన్ ఫ్రెండ్లీగా భావిస్తుందని.. జెమినీ వంటి గూగుల్ ఉత్పత్తుల దృశ్య శైలికి సరిపోతుందని మరో యూజర్ పేర్కొన్నారు.