Google Pixel 8 Pro | గూగుల్ పిక్సెల్ 8 ప్రో (Google Pixel 8 Pro) ఫోన్ను గత నెల నాలుగో తేదీన ‘మేడ్ బై గూగుల్ 2023 (Made by Google 2023)’ ఈవెంట్లో ఆవిష్కరించింది. గత నెల 12 నుంచి గూగుల్ పిక్సెల్ 8 ప్రోతోపాటు గూగుల్ పిక్సెల్ 8 ఫోన్లు విక్రయిస్తున్నది. ఆవిష్కరణ టైంలో గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఫోన్ కేవలం 12 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ మాత్రమే రిలీజ్ చేసింది. దాని ధర రూ.1,06,999 (ఎక్స్ షోరూమ్)గా ప్రకటించింది. మూడు కలర్లు – బే, ఒబ్సిడియాన్, పోర్సెలియాన్ రంగుల్లో లభిస్తాయి గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లు. తాజాగా గూగుల్ తన గూగుల్ పిక్సెల్ 8 ప్రో కొత్త స్టోరేజీ వర్షన్ తో మార్కెట్ లో రిలీజ్ చేసింది.
గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఫోన్ తాజాగా 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రిలీజ్ చేసింది. దీని ధర రూ.1,13,999గా నిర్ణయించింది. ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ.9000, ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.4000 అదనపు రాయితీ లభిస్తుంది. మిగతా వేరియంట్లకూ ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయి.
గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఒబ్సిడియన్ కలర్ ఆప్షన్ లో మాత్రమే లభిస్తుంది.
ఆండ్రాయిడ్ 14 ఔటాఫ్ బాక్స్ వర్షన్ మీద పని చేస్తున్న గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఫోన్ 6.7 అంగుళాల క్వాడ్ హెచ్డీ (1344 x 2992 పిక్సెల్స్) స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఫోన్ గూగుల్ టెన్సోర్ జీ3 ఎస్వోసీ చిప్ సెట్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్ తో పని చేస్తుంది.
ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తున్న గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఫోన్ లో 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరా, రెండు 48-మెగా పిక్సెల్ సెన్సర్లు, సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 10.5 మెగా పిక్సెల్స్ కెమెరా ఉంటాయి. 30 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5050 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.