న్యూయార్క్ : కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ లమ్దాకు స్వయంగా తెలుసుకునే శక్తి ఉందని పేర్కొన్న సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను గూగుల్ విధుల నుంచి తొలగించింది. టెకీ బ్లేక్ లెమోనీ కంపెనీ నిబంధనలు ఉల్లంఘించాడని, లమ్దాపై అతడి వ్యాఖ్యలు పూర్తిగా ఊహాజనితమైనవని గూగుల్ పేర్కొంది.
ప్రోడక్ట్ సమాచారాన్ని కాపాడటం సహా డేటా సెక్యూరిటీ పాలసీలను ఉల్లంఘించాడని గూగుల్ ప్రతినిధి తెలిపారు. లెమోనీ వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని గూగుల్ సమా పలువురు సైంటిస్టులు పేర్కొన్నారు. విశ్వసించదగిన మానవ భాషను రూపొందించేందుకు డిజైన్ చేయబడిన లమ్దా కేవలం ఒక సంక్లిష్టమైన అల్గారిథమని గూగుల్ స్పష్టం చేసింది. కంపెనీ ల్యాంగ్వేజ్ మోడల్స్‌పై చేపట్టిన పరిశోధనలపై డైలాగ్ అప్లికేషన్స్ కోసం లమ్దాను డిజైన్ చేశామని కంపెనీ పేర్కొంది.