Google | ఇజ్రాయెల్ కాంట్రాక్టును నిరసిస్తూ గళమెత్తిన ఉద్యోగులపై గూగుల్ వేటు
Google : ఇజ్రాయెల్‌తో క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ నింబస్‌ను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన 28 మంది ఉద్యోగులను టెక్ దిగ్గజం గూగుల్ తొలగించింది.
Google : ఇజ్రాయెల్‌తో క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ నింబస్‌ను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన 28 మంది ఉద్యోగులను టెక్ దిగ్గజం గూగుల్ తొలగించింది. ఈ కాంట్రాక్ట్‌కు వ్యతిరేకంగా ఈ ఉద్యోగులు ఇటీవల రెండు గూగుల్ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టారు. అంతకుముందు మంగళవారం గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ కార్యాలయాన్ని 8 గంటల పాటు ముట్టడించి అక్కడి నుంచి కదిలేందుకు నిరాకరించిన కొందరు ఉద్యోగులను అరెస్ట్ చేశారు.
ఉద్యోగుల అరెస్ట్ అనంతరం నిరసనకారులపై గూగుల్ వేటు వేసిందనే వార్తలు వెలువడ్డాయి. ఇలాంటి ప్రవర్తనకు గూగుల్‌లో చోటులేదని, వీటిని ఉపేక్షించే ప్రసక్తి లేదని కంపెనీ జారీ చేసిన ఇంటర్నల్ మెమో వెల్లడించిందని వెర్జ్ తెలిపింది.
ఉద్యోగులు ఇలా ప్రవర్తిస్తే సహించబోమని, నిరసనలకు దిగితే ఉపేక్షించేందిలేదని గూగుల్ గ్లోబల్ సెక్యూరిటీ హెడ్ క్రిస్ రాకో ఉద్యోగులను హెచ్చరించారని వెర్జ్ రిపోర్ట్ పేర్కొంది. న్యూయార్క్, సన్నీవేల్లో గూగుల్ కార్యాలయాల వద్ద కంపెనీ ఉద్యోగులు ధర్నా చేపట్టిన తీరును మెమోలో ప్రస్తావించింది. నిరసనకారులు కార్యాలయ ప్రాంగణాలను స్వాధీనం చేసుకున్నారని, ఇతర గూగుల్ ఉద్యోగుల పనిని భౌతికంగా అడ్డుకున్నారని మెమోలో పేర్కొంది.
Read More :
Narayankhed | అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

