Microsoft AI | లేటెస్ట్ టెక్నాలజీపై టెక్ దిగ్గజం ఫోకస్ : మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈవోగా గూగుల్ డీప్‌మైండ్ కో ఫౌండర్
Microsoft AI : టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏఐ రేస్‌లో దూకుడు పెంచాయి. రెండు దిగ్గజ కంపెనీలు తమ సొంత ఏఐ చాట్‌బాట్స్ బింగ్ (కోపైలట్), బార్డ్ (జెమిని)లను లాంఛ్ చేశాయి.
Microsoft AI : టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏఐ రేస్‌లో దూకుడు పెంచాయి. రెండు దిగ్గజ కంపెనీలు తమ సొంత ఏఐ చాట్‌బాట్స్ బింగ్ (కోపైలట్), బార్డ్ (జెమిని)లను లాంఛ్ చేశాయి. ఇక ఏఐ టూల్స్‌ను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూ ముందుకెళుతున్నాయి. ఇక జనరేటివ్ ఏఐపై మరింత ఫోకస్ పెడుతూ మైక్రోసాఫ్ట్ న్యూ ఏఐ డివిజన్‌ను డెవలప్ చేస్తోంది.
ఈ న్యూ ఏఐ డివిజన్‌కు సీఈవోగా గూగుల్ డీప్‌మైండ్ కో పౌండర్ ముస్తఫా సులేమాన్‌ను మైక్రోసాఫ్ట్ నియమించింది. డీప్‌మైండ్‌లో అప్లైడ్ ఏఐ హెడ్‌గా పనిచేసిన సులేమాన్ నూతన నియామకంపై ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మైక్రోసాఫ్ట్ ఏఐ డివిజన్‌కు నేతృత్వం వహించేందుకు తాను ఉత్సుకతతో వేచిచూస్తున్నానని సులేమాన్ రాసుకొచ్చారు.
తన స్టార్టప్ ఇన్ఫ్లెక్షన్ఏఐ కో ఫౌండర్ కరెన్ సిమోన్యన్ సహా పలువురు ఉద్యోగులు తనతో పాటు మైక్రోసాఫ్ట్ ఏఐ డివిజన్లో చేరుతున్నారని చెప్పారు. ఇన్ఫ్లెక్షన్ ఏఐకి కొత్త సీఈవో వస్తారని ఈ స్టార్టప్‌తో అద్భుత ప్రయాణం సాగిందని సులేమాన్ గుర్తుచేసుకున్నారు. పనులు ఇప్పుడే మొదలయ్యాయని రాస్తూ ఆయన తన పోస్ట్‌ను ముగించారు.
Read More :
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

