Worlds Happiest Countries | ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాలివే.. టాప్‌లో ఫిన్లాండ్.. భారత్ స్థానం ఎంతంటే..?
Worlds Happiest Countries | 2024లో ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల (Worlds Happiest Countries) జాబితాలో ఫిన్లాండ్ (Finland) మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.
Worlds Happiest Countries | 2024లో ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల (Worlds Happiest Countries) జాబితాలో ఫిన్లాండ్ (Finland) మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. యూఎన్ ఆధారిత సంస్థ విడుదల చేసిన రిపోర్ట్‌లో వరుసగా ఏడోసారి ఆ దేశం టాప్ ప్లేస్‌లో నిలిచింది. బుధవారం ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్’ (International Day of Happiness) సందర్భంగా యూఎన్ ఆధారిత సంస్థ ర్యాంకులను విడుదల చేసింది.
జీవితంపట్ల సంతృప్తి, దేశ తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, ఆయుర్దాయం, స్వేచ్ఛ, దాతృత్వం వంటి అంశాల ఆధారంగా ప్రపంచంలోనే 143 దేశాలకు ర్యాంకింగ్‌లను నిర్ణయించినట్టు సంస్థ వెల్లడించింది. ఈ రిపోర్ట్‌లో నార్డిక్ దేశాలైన ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక ఈ జాబితాలో భారత్ ఏకంగా 126వ స్థానంలో నిలివడం గమనార్హం. ఈ జాబితాలో చైనా (60), నేపాల్ (93), పాకిస్థాన్ (108), మయన్మార్ (118) దేశాలు మనకంటే ముందుస్థానాలో నిలిచాయి. 2020లో తాలిబన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్థాన్ ఈ జాబితాలో చిట్టచివరి స్థానం (143)లో నిలిచింది. కోస్టారికా 12వ స్థానంలో, కువైట్ 13వ స్థానంలో నిలిచాయి. ఇక అగ్రరాజ్యం అమెరికా 23వ స్థానం, జర్మనీ 24వ ర్యాంకులో నిలిచాయి.
టాప్ 10లో నిలిచిన దేశాలు..
- ఫిన్లాండ్
- డెన్మార్క్
- ఐస్లాండ్
- స్వీడన్
- ఇజ్రాయెల్
- నెదర్లాండ్స్
- నార్వే
- లక్సెంబర్గ్
- ఆస్ట్రేలియా
Also Read..
Gold mine collapse | కుప్పకూలిన బంగారు గని.. చిక్కుకుపోయిన 13 మంది కార్మికులు
Earthquake | పాకిస్థాన్‌ను వణికించిన భూకంపం
Donald Trump: ఇలియనాస్ ప్రైమరీలో గెలిచిన డోనాల్డ్ ట్రంప్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
Saurav Das | జైలు నుంచి విడుదలైన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా.. వెంటనే క్రైమ్ బ్రాంచ్ నోటీసులు
Rafale-M | ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక నుంచి రాఫెల్-ఎమ్ విమానం టేకాఫ్.. పరీక్షించిన ఇండియన్ నేవీ
Murder | రూ.20 వాటర్ బాటిల్ కోసం ప్రాణాలు తీశారు.. అదుపులో నిందితులు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

