Gold mine collapse | రష్యా (Russia)లో ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు సైబీరియాలోని అముర్ ప్రాంతంలో గల జైస్క్ జిల్లాలోని పయనీర్ మైన్ (Pioneer Mine) మంగళవారం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది (Gold mine collapse). ఈ ఘటనలో 13 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు.
అయితే 15 మంది వరకూ కార్మికులు భూగర్భంలో ఉండొచ్చని ప్రాంతీయ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. వారంతా దాదాపు 410 అడుగుల లోతున చిక్కుకుపోయినట్లు తెలిపింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. కాగా, రష్యాలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ కార్యకలాపాల్లో పయనీర్ మైన్ ఒకటి అని రాయిటర్స్ నివేదించింది. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read..
Earthquake | పాకిస్థాన్‌ను వణికించిన భూకంపం
Donald Trump: ఇలియనాస్ ప్రైమరీలో గెలిచిన డోనాల్డ్ ట్రంప్
Zomato: గ్రీన్ రైడర్స్‌పై క్లారిటీ ఇచ్చిన జొమాటో సీఈవో