హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ): దేశంలో ఆఫీసులు, కో-వర్కింగ్ సౌకర్యాలు సమకూర్చే ప్రముఖ సంస్థ ‘గుడ్‌వర్క్స్ కోవర్క్’ ఎక్తా గ్రూప్ భాగస్వామ్యంతో హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మొత్తం 1.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రీమియం గ్రేడ్-ఏ ఆఫీస్ స్థలాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
‘జీసీసీలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారింది. ఇందులో మేము కూడా భాగస్వాములం అవుతున్నాం’ అని గుడ్‌వర్క్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో విశ్వాస్ ముదగల్ తెలిపారు. గుడ్‌వర్క్స్ భాగస్వామ్యంతో హైదరాబాద్‌తోపాటు విశాఖపట్నం, విజయవాడల్లో కూడా ఆఫీస్ స్పేస్‌ను విస్తరించనున్నట్లు ఏక్తా గ్రూపు సీఎండీ శ్రీనివాస మూసాని తెలిపారు. ప్రస్తుతం బెంగళూరుతో పాటు ఇతర మెట్రో నగరాల్లో గుడ్‌వర్క్స్ 8 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను నిర్వహిస్తుండగా, హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న రెండు కేంద్రాలతో ఇది 10 లక్షల చదరపు అడుగులకు చేరుకోనున్నది.