హైదరాబాద్ : పోస్టాఫీస్ రీకరింగ్ డిపాజిట్(ఆర్డీ)అకౌంట్ ద్వారా చిన్న మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి, అధిక వడ్డీ రేటుతో మంచి రిటర్న్స్ పొందవచ్చు. మీరు కనీసం రూ.100మొత్తంతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. ఆర్డీ డిపాజిట్ అకౌంట్ పరిమితి ఐదేండ్లు. బ్యాంకుల్లో రికరింగ్ డిపాజిట్ అకౌంట్ కాలపరిమితి ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఏడాది, రెండేండ్లు, మూడేండ్లు ఉంటుంది. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీని లెక్కిస్తారు. ఈ మొత్తాన్ని అకౌంట్ హోల్డర్ ఖాతాలో జమ చేస్తారు.
రూ.10వేలు పెట్టుబడితో రూ.16 లక్షలు..
ప్రస్తుతం పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పైన 5.8 శాతం వడ్డీ రేటు ఉంది. ప్రతి త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటును సవరిస్తుంది. అన్ని పోస్టాఫీస్ సేవింగ్స్ ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు సవరిస్తుంది. ఈ స్కీంలో మీరు ప్రతి నెల రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత మీకు రూ.16 లక్షలు వస్తుంది. మీరు ప్రతి నెల పోస్టాఫీస్ ఫిక్సిడ్ డిపాజిట్ (ఎఫ్డీ) లో రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే పదేండ్లకు రూ.16 లక్షలు వస్తుంది.